ఉల్లాస్ రెండో విడత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువు వెలుగు మండల సమాఖ్య కార్యాలయం నందు వయోజన విద్య పర్యవేక్షకులు సుధాకర్ మధుసూదన్ లు పుట్టపర్తి ఏరియా మండలాలకు సంబంధించిన వెలుగు సీసీలు ఏపీఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యవేక్షకులు మాట్లాడుతూ గ్రామాలలో 18 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. గుర్తించిన వారి వివరాల వయోజన విద్యాశాఖ వారు ఇచ్చిన ప్రొఫార్మాలో పొందుపరచాలని పేర్కొన్నారు.