ఓడిచెరువు మండలంలోని డబురువారిపల్లి గ్రామ వికాస్ సమితి ఆధ్వర్యంలో రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు పండరి భజన, కోలాటం, చెక్కల భజనలు ప్రదర్శిస్తారని గ్రామ పెద్దలు శనివారం ప్రకటించారు. విద్యావంతులు, మేదావులు, కళాకారులు, యువత విద్యార్థులను ఆశీర్వదించి, ప్రోత్సహించాలని శిక్షణ గురువు కోరారు. ప్రతి రోజు కళ ప్రదర్శనతో పాటు నెల తర్వాత పెద్ద ఎత్తున కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారన్నారు.