ఓడిచెరువు మండలానికి సమీపంలోని ఎం. కొత్తపల్లి బండపై ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కమ్యూనిటీ మరుగుదొడ్లు మంజూరయ్యాయని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు, గురుస్వామి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ మండల కో ఆర్డినేటర్ వెంకటరమణ నాయక్, మాజీ సొసైటీ అధ్యక్షులు పిట్టా ప్రభాకర్ రెడ్డి, టైలర్ నిజాం ఉన్నారు.