పెనుకొండ లోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవితమ్మ తెలిపారు. మహిళల్లో ఆత్మ గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతోందని పెనుకొండ పట్టణములో వివేకానంద జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలను మంత్రి సవితమ్మ ప్రారంభించారు.