శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ వి. రత్న మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జూదం, పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. తమ స్వగ్రామాలకు వెళుతున్న వారు బంగారు ఆభరణాలు, వస్తువులను జాగ్రత్త భద్రపరుచుకోవాలని సూచించారు. ప్రజలు ఎల్ హెచ్ఎంఎస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.