పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల నుంచి విరివిగా దరఖాస్తులు ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 2025-26 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీ క్షసమావేశం నిర్వహించి పలుసూచనలు చేశారు.