ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీన తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారులతో మాట్లాడేందుకు సత్యసాయి జిల్లా కొత్తచెరువులోని జూనియర్ కాలేజ్ కు రానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్, ఎస్పి రత్న మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికారులు నాయకులు కార్యకర్తలు పర్యవేక్షించారు.