ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమం పై సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ శనివారం విలేకర్ల సమావేశంలో వివరణ ఇచ్చారు. దారిద్రరేఖకు దిగువనున్న వారిని గుర్తించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారిని అభివృద్ధి చేయడమే పీ4 ముఖ్య ఉద్దేశం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం జిల్లాలో విజయవంతం చేయాలన్నారు.