ఉమ్మడి అనంతపురం జిల్లాలోని డీఎస్సీ 2008:49మంది ఉపాధ్యాయులకు కామన్ సీనియారిటీ అమలు చేయాలని డిటిఎఫ్ నాయకులు కోరారు. పుట్టపర్తి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ 'టిస్'లో బాధిత ఉపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలన్నారు. 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. వెంటనే 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పెండింగ్ డిఏలు చెల్లించాలని కోరారు.