సాగునీటి సంఘ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ నీటి పారుదల శాఖ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ కు వివరించారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ సాగునీటి సంఘాల ఎన్నికలపై ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.