ఖిద్మత్ఎఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ షామీర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ చేతుల మీదగా 65 మందికి పరీక్ష సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు తమకు విద్యను బోధించిన గురువులను గుర్తుపెట్టుకుని, ప్రేమతో అందించిన విద్య పట్ల భక్తి శ్రద్ధలతో చదివి మంచి కీర్తి ప్రతిష్ఠలను తీసుకురావాలని తెలియజేశారు.