నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో, మెట్ట భూములలో రైతులు మునగ పంట వేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ రైతులకు పిలుపునిచ్చారు బుధవారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ బుక్కపట్నం మండలం, కొత్తచెరువు మండలంలో ఈ క్రాప్ నమోదు రభి సీజన్లో సూపర్ చెక్ కార్యక్రమం అమలుపై రైతులతో సమీక్షించారు. అనంతరం పంట పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఏ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.