మూడు రోజులపాటు అనంతపురం జిల్లా పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్ లో గురువారం గుత్తి మండలం బేతపల్లికి చేరుకున్న ఐటీ, విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.