సత్యసాయి జిల్లా లోని పలు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దాదాపు 24 మండలాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసాయని అధికారులు తెలిపారు. సగటున 529. 06 మి. మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. కనగానపల్లి మండలంలో అత్యధికంగా 75. 2 ధర్మవరం 71. 6 బుక్కపట్నం 46, తాడిమర్రి 41. 2 బత్తలపల్లి 36. 2 ఇక పుట్టపర్తి మండలంలో 33 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు చెప్పారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.