పుట్టపర్తిలోని ధర్నాచౌక్ నందు ఎస్సీ, ఎస్టీ సంఘాలఆధ్వర్యంలో సోమవారం నిరవధికదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జైభీమ్ రాష్ట్రఅధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ కూటమిప్రభుత్వం వచ్చినప్పటినుంచి దళితులపై అక్రమ కేసులుపెరిగిపోయాని ఆవేదన వ్యక్తంచేశారు. కదిరిలో దళితనాయకుడు గుడిసెదేవానంద్, షేక్ నస్రీనాభాను మధ్య స్థలవివాదం విషయంలో ఫిర్యాదు చేయగా సీఐ ఓప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు నాన్బెయిలబుల్ కేసునమోదు చేయడం సమంజసం కాదన్నారు.