దీపం పథకం -2 పటిష్టంగా అమలు చేయండి అని సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టరు అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి స్థానిక కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ ఛాంబర్ లో పుట్టపర్తి మండల పరిధిలోని గ్యాస్ ఏజెంట్స్ ప్రతినిధులతో దీపం పథకం-2 సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.