పుట్టపర్తి: రేషన్ బియ్యం సరఫరాలో కందిపప్పు మాయం

67చూసినవారు
పుట్టపర్తి: రేషన్ బియ్యం సరఫరాలో కందిపప్పు మాయం
శ్రీ సత్యసాయి జిల్లాలో పేదల పొయ్యిపై పప్పు ఉడుకుతుంది అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కందిపప్పు సరఫరా చేసింది. ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసి చేతులెత్తేసింది. కందిపప్పు కావాలని అడుగుతున్న కార్డుదారులకు రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనదారులు స్టాకు లేదని చెబుతున్నారు. దీంతో లబ్దిదారులు నిరాశకు లోనవుతున్నారు.

సంబంధిత పోస్ట్