పుట్టపర్తి నియోజకవర్గంలోని కొట్లపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను Flrfekg ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రెండో తరగతి విద్యార్థులకు సైన్స్ పాఠం బోధించారు. రోడ్డు ఎలా దాటాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించే విధానం వంటి అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఆమె వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.