పుట్టపర్తి: నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం

నేడు పుట్టపర్తి మునిసిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కమీషనర్ ప్రహ్లాద తెలిపారు. మునిసిపల్ సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు చైర్మెన్ తుంగ ఓబులపతి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సింధూర రెడ్డి హాజరవుతారని కావున మునిసిపల్ కౌన్సిలర్ లు అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు.