జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలపైన ప్రజలందరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వాహన దారులకు, స్కూల్ విద్యార్థులకు రహదారిపై జరిగే ప్రమాదాలపై వాటిని ఎలా అరికట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.