ఓడిసి మండలంలోని వీరప్పగారిపల్లిలో అంగన్వాడి కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న నాగమణిని వెంటనే తొలగించాలని రాయలసీమకమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లాకలెక్టర్ చేతన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్సి. పి డివిజన్ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ అక్రమమద్యం అమ్ముతున్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.