శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాల హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అక్రమ మద్యం, గంజాయి, నియంత్రణలు క్షుణ్ణంగా పరిశీలించారు.