జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరగనున్న 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకలకు సంబంధించి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.