శ్రీసత్యసాయి జిల్లాలో ఓపెన్ ఇంటర్ ఫీజుల దోపిడీని ఆపాలని డీఈఓ ఆఫీస్ లో మంగళవారం సూపరింటెండెంట్ కి ఎస్ఎఫ్ ఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హిందూపురంలో ఒపెన్ ఇంటర్ పరీక్షలలో కోఆర్డినేటర్ లు చేస్తున్న మాస్ కాపీయింగ్ శనివారం పత్రికల్లో కూడా వచ్చిందని వాటిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.