పుట్టపర్తి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్, పుట్టపర్తి రూరల్ ఎస్సై లింగన్న సిబ్బందితో కలిసి బుధవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిఐ శివ ఆంజనేయులు, ఎస్ఐ రామచంద్ర పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో 84 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కేజీల 173 గ్రాముల వెండి, ఒక బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రాపర్టీ రికవరీ, దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది ఎస్పీ అభినందించారు.