స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్‌ను కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి కలెక్టరేట్ లో సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని జిల్లా ముఖ్య ప్రణాళికా శాఖ కార్యాలయం వద్ద ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.