తొలి సంతకానికే వన్నె తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కిందని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి కొనియాడారు.ముఖ్యమంత్రిగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేసిన తొలి సంతకానికి 21ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పుట్టపర్తి జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి కేక్ కటింగ్ చేసారు.