యోగాతోనే మనిషి జీవితానికి ఎంతో ఆరోగ్యకరమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీలోని సత్యమ్మ ఆలయం ప్రక్కన ఉన్న ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన యోగేంద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగా వల్ల ప్రతి మనిషికి ఎంతో ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.