సోమందేపల్లి మండలం పందిపర్తిలో శానిటేషన్ పనులు చేయించారు సర్పంచ్ ఎర్రమ్మ. గ్రామంలో మురిగి కాలువలు శుభ్రం చేయించడం, బ్లిచింగ్ పౌడర్ చల్లించడం, చెత్త చెదారాలు తీయించే పనులను బుధవారం చేపట్టారు పారిశుధ్య కార్మికులు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రమ్మ మాట్లాడుతూ.. ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే రాజకీయ నాయకుల లక్ష్యమన్నారు.