సత్యసాయి: సిబ్బంది సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

49చూసినవారు
సత్యసాయి: సిబ్బంది సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. రత్న ఐపీఎస్ ప్రత్యేక బ్రాంచ్ సిబ్బందికి శనివారం లెదర్ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. వీధుల్లో జరిగే కార్యకలాపాలపై దృష్టి సారించి, ముందస్తు సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్