అగ్ని వీర్ నియామకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని గురువారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ పేర్కొన్నారు. వివిధ కేటగిరీల అగ్ని వీర్ నియామకం కోసం ఏప్రిల్ 10వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మొట్టమొదటి సారిగా తెలుగుతో పాటు 13 వేర్వేరు భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.