ఉబ్బరవాండ్లపల్లి: టీడీపీ, వైసీపీని వీడి సిపిఐలో చేరిక

74చూసినవారు
ఉబ్బరవాండ్లపల్లి: టీడీపీ, వైసీపీని వీడి సిపిఐలో చేరిక
తలుపుల మండల పరిధిలోని ఉబ్బరవాండ్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి, వైసిపి కార్యకర్తలు 11మంది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లోకి శుక్రవారం చేరారు. వారికి సాధారణంగా దళిత హక్కుల పోరాట సమితి అంజిన్ బాబు, సిపిఐ మండల కార్యదర్శి జగిలి ఈశ్వరయ్య ఆహ్వానించి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బట్రేపల్లి వెంకటనారాయణ, మండల సహాయ కార్యదర్శి సిద్దయ్య, ఖాదర్ బాషా పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్