మూడు రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి 'రాజధాని మహిళల శీల హననం' గురించి మాట్లాడటం జరిగింది. ఇటువంటి సాక్షి ఛానల్ ని, సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ పెనుకొండ పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ర్యాలీ నిర్వాహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా దర్గా సర్కిల్ తెలుగు తల్లి సర్కిల్ మీదుగా వచ్చి ఆర్డిఓ కార్యాలయం నందు ఏవోకి మంగళవారం వినతి పత్రం అందజేశారు.