రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో అర్ధాంతరంగా ఆగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని గ్రామస్థులు బుధవారం కోరారు. అమరావతిలో ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేయకపోవడంతో ఆగిపోయిందని మంత్రికి వివరించారు.