టింబక్టు కలెక్టిక్ సహకారంతో మహాశక్తి సమైక్య, ఆదిశక్తి సొసైటీ ఆధ్వర్యంలో చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని ప్యాధిండి గ్రామంలో మంగళవారం ఉచిత న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. గృహహింస, మహిళల అనారోగ్యాల పట్ల ఆదిశక్తి సొసైటీ సిబ్బంది నాటక రూపంలో మహిళలకు అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ, హింసకు గురవుతున్న ప్రతి మహిళ చట్టం ద్వారా ఎలా రక్షణ పొందవచ్చునని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు వివరించారు.