చెన్నై కొత్తపల్లి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడిపందాలు, పేకాట వంటి జూదాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శనివారం సికేపల్లి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. తమ ఆదేశాలను దిక్కరించి ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి జూదాలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.