చెన్నైకొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ పై పోలీసులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాను ఎలా ఆపరేట్ చేయాలన్న దానిపై పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రామగిరి కనగానపల్లి సికెపల్లి ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.