సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామీణ ప్రభుత్వ యునాని వైద్యశాలలో డాక్టర్ ఖాదర్ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ ఖాదర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు పాల్గొన్నారు.