రామగిరి మండలంలోని నసనకోట దుర్గమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం బోనాల సమర్పణ వైభవంగా సాగింది. మూడు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అమ్మవారి క్షేత్రం ఒక జనసంద్రన్ని తలపించింది. నసనకోట, గంగంపల్లి, వెంకటాపురం గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తమ ఇంటి నుంచి బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు దుర్గమాంబను కొలుస్తూ బోనాలు సమర్పించారు.