చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి (45) అనే వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.