చెన్నై కొత్తపల్లి మండలంలోని చిన్న పల్లి గ్రామంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలోని ఎల్లమ్మ గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వర్షాలు బాగా కురిసి పంటలు సక్రమంగా పండి ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.