రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని రామగిరి మండలానికి వెళ్లకుండా పోలీసులు గురువారం అడ్డుకున్నారు. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. అక్రమ అరెస్టులు సరికాదని, రాష్ట్రంలో ప్రజాపాలన కాదని, రాక్షస పాలన నడుస్తోందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.