రామగిరి మండల కేంద్రంలో దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినికిడి యంత్రాలను ఉచితంగా అందించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. రామగిరి మండలం కేంద్రంలోని పరిటాల రవీంద్ర ఆడిటోరియంలో గురువారం క్యాంపులు మొదలయ్యాయి. ఈనెల 15వ వరకు ఈ క్యాంపులు జరగనున్నాయి. దారిద్ర రేఖకు దిగువన ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న విద్యార్థులకు ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు.