రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో బుధవారం జిల్లా దేవదాయ శాఖ అధికారి నరసింహారాజు ఆధ్వర్యంలో ఆలయంలోని రెండు హుండీల లెక్కింపు చేపట్టారు. 3,80,817 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవదాయ శాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై బంగారు ఏఎస్ఐ, బ్యాంకు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.