రామగిరి మండలం నసనకోట శ్రీ దుర్గమాంబ జాతర మహోత్సవాలు మూడవ రోజు కూడా కొనసాగాయి. శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇతర కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభయాంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ హోమం, కుష్మాండఫల సమర్పణ, ఓదన సమర్పణల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు.