రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రం సమీపాన గల త్రికోణకారపు కొండల్లో వెలిసిన మాత శ్రీ అంజనాదేవి 48వ ఆరాధనమహోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు ఆశ్రమ అధ్యక్షులు దత్త నందగిరి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 6 గంటలకు గోపూజ బజార్హణం 7 గంటల నుండి భగవద్గీత పారాయణం హరికథ కాలక్షేపం భోజనం, భజన కార్యక్రమం ఉంటాయని తెలిపారు. కావున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు