కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని చాపట్లకు నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఆమె ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మించామన్నారు. మాట ఇస్తే నిలుపుకునే కుటుంబం పరిటాల కుటుంబమని గుర్తు చేశారు.