తిరుపతికి వచ్చే భక్తుల భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతిలో తొక్కిసలాట చరిత్రలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. భక్తుల భద్రత సీఎం చంద్రబాబుకు పట్టదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలతో పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అని ప్రశ్నించారు.