ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎం. అనూష ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించారు. నిన్న బెంగళూరులో మాల్దీవుల జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించి జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఒక సాధారణ గ్రామీణ ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగిన అనూషను ఆర్. డి. టి సిబ్బంది శుక్రవారం అభినందించారు.