కనగానపల్లి మండల కేంద్రంలోని శ్రీ తిరుమల రాయిని దేవస్థానంలో ఈ నెల 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు శనివారం తెలిపారు. అందులో మొదటి బహుమతి రూ. 10, 016, రెండో బహుమతి రూ. 8, 116, మూడవ బహుమతి రూ. 6, 116, నాలుగో బహుమతి రూ. 4, 116, ఐదో బహుమతి రూ. 2, 116 ఉన్నట్లు తెలిపారు. భజన పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈ నెల 9వ తేదీ లోపు ఆలయ కమిటీ సభ్యుల వద్ద నమోదు చేసుకోవాలన్నారు.